క్రీడల్లో పూలే పాఠశాల విద్యార్థుల విజయకేతనం
ఘట్కేసర్, సెప్టెంబర్ 25 (ప్రజావాణి): 70వ ఎస్జీఎఫ్ ఘట్కేసర్ జోన్ జోనల్ లెవెల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే మల్కాజ్‌గిరి బాయ్స్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. కబడ్డీ అండర్-14 బాలుర విభాగంలో, వాలీబాల్ అండర్-17 బాలుర విభాగంలో విజేతలుగా నిలిచారు. అలాగే ఖో-ఖో అండర్-14, అండర్-17 బాలుర విభాగాల్లోనూ విజేతలుగా నిలిచి విజయకేతనం ఎగురవేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థుల విజయంపై పాఠశాలలో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా...