📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్తెలంగాణ పౌరుషానికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ

తెలంగాణ పౌరుషానికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ

📰 Generate e-Paper Clip

తెలంగాణ పౌరుషానికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ: కులకచర్లలో ఘనంగా 131వ జయంతి వేడుకలు

పరిగి సెప్టెంబర్ 26 (ప్రజావాణి)

తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి (చిట్యాల) ఐలమ్మ 131వ జయంతి వేడుకలను మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల రజక సంఘం అధ్యక్షుడు టి. రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూర్ వెంకటేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. త్వరలోనే ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన చేపట్టనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూరు వెంకటేష్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ తెగువకు, పౌరుషానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. భూస్వామ్య ఆధిపత్యానికి, అహంకార ధోరణులకు వ్యతిరేకంగా పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం వీరోచితంగా పోరాడిన నిప్పుకణిక ఆమె అని పేర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమని అన్నారు.
హాజరైన ప్రముఖులు:
ఈ వేడుకల్లో పీఏసీఎస్ చైర్మన్ బొల్సని భీమ్ రెడ్డి, సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య, కుల్కచర్ల మండల బీ ఆర్ ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు సేరి రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్, ఏఎంసీ చైర్మన్ బి.ఎస్. ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, ఉప సర్పంచ్ మలే విజయ్ కుమార్, న్యాయవాది బాల ముకుందం, మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య, దళిత సంఘాల కన్వీనర్ తుప్పాలి అశోక్ కుమార్, జిల్లా నాయకులు ప్రేమ్ ప్రకాష్ రెడ్డి, మలే కృష్ణయ్య గౌడ్, చెలిమిల్ల చంద్రలింగం, గదే మహిపాల్, రాంపూర్ సర్పంచ్ తిరుపతయ్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.
మరియూ పీ ఏ సి యస్ డైరెక్టర్లు భరత్ రెడ్డి, టి. రామచంద్రయ్య, ఎల్లయ్య, బోయిని కృష్ణయ్య,గ్రామ పెద్దలు రాములు, తుప్పలి వెంకటేష్, నాగని వెంకట్ రాములు, బిచ్చయ్య, జెట్టిగల వెంకటయ్య, శివాని ఎల్లయ్య,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కొమ్మ శ్రీనివాస్, బాలులతో పాటు రజక సంఘం నాయకులు లక్ష్మయ్య, కృష్ణయ్య, వెంకటయ్య, హన్మంతు, గోపాల్, భీమయ్య, చిన్న బాలయ్య, బాలు, తిరుపతి, వెంకటేష్, కేశవులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.