*అసహజ మరణాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు*
జోహార్ నగర్ సెప్టెంబర్ 26 ( ప్రజావాణి ప్రతినిధి)
— జవహర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాటకమిటి ఆధ్వర్యంలో రాంకీ యాజమాన్యంపై సిఐ సైదులుకు వినతిపత్రం.
ఇటీవల జవహర్ నగర్ డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న అసహజ మరణాలపై ప్రభుత్వం, పోలీసులు తగిన చట్టబద్దమైన చర్యలు చేపట్టాలని బొల్లం కృష్ణ భాదిత కుటుంబ సభ్యులచే జవహర్ నగర్f స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సైదులు గారికి డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాటకమిటి ఆధ్వర్యంలో వినతిపత్రాన్న సమర్పించారు. 2026, సెప్టెంబర్-25, శుక్రవారం రోజు, సాయంత్రం జేఏసి చైర్మన్ షేక్ షావలి(ఇఫ్టూ), కన్వీనర్ ఉమామహేష్(సిపిఐ), కోశాధికారి పి.శివబాబు(ఐ.ఎఫ్.టి.యు), కో కన్వీనర్స్ గడ్డం సదానందం(సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్), సుబ్రమణ్యం(మాజీ కార్పొరేటర్), వై మల్లేష్ (ఏ.ఐ.ఎఫ్.టి.యు), జయ(సిఎంఎస్), డి.జాన్(పికెఎం),
గడిపే సునిత (పిఓడభ్ల్యూ(విముక్తి)), వి.ప్రవీణ్ (టియుసిఐ), దశరథ (సీపిఐ), అంబాల ఎల్లయ్య (ఏఐటీయూసీ), జయసుధ (పిఓడభ్ల్యూ) మరియు బొల్లం కృష్ణ బందువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సైదులు గారిని కలిసి సమస్య యోక్క తీవ్రతను వివరించారు. కంటికి కనిపించని వైరస్ లాగా డంపింగ్ యార్డు నుండి వెలువడే విషపు గాలులు వలన రకరకాల వ్యాధులకు గురై, అర్థాంతరంగా మృత్యువాత పడుతున్న అకాల మరణాలకు కారణమవుతున్న రాంకీ యాజమాన్యం మరియు సిబ్బందిపై చట్టపరంగా చర్యలు చేపట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. చట్టపరంగా తమ పరిధిలో వచ్చే వాటిపై సాక్ష్యాధారాలు ఉంటే తప్పకుండా చర్యలు ఉంటాయనే విషయాన్ని సిఐ సైదులు గారు తెలియజేశారని అన్నారు. సానుకూలంగా స్పందించినందుకు జేఏసీ కమిటీ సిఐ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి అన్యాయ, అక్రమ, బలవంతపు మరణాలపై ప్రభుత్వ పర్యావరణ అధికారులచే సమగ్ర ధర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రకృతి పర్యావరణాన్ని, సకల జీవరాశుల ప్రాణాలను ద్వంసం చేస్తున్న చెత్త డంపింగ్ యార్డు పై గత ఎన్నికలకు ముందు, ఆతర్వాత జవహర్ నగర్ ప్రాంతాల ప్రజలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామిలో బాగంగా ఎలాంటి కాలాపన చేయకుండా డంపింగ్ యార్డును ఎత్తివేయాలని ఈ సందర్భంగా సూచించారు. లేనియెడల భవిష్యత్ లో జరిగే ప్రజా ఆందోళనకు రాంకీ యాజమాన్యం, ప్రభుత్వ అధికారులే నైతిక భాద్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైన రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎం.పి. ఈటేల రాజేందర్, అధికారపార్టీ డిసిసి చైర్మన్ వజ్రేష్ యాదవ్ జీవించే హక్కులు కాలరాయ బడుతున్న క్రమంలో ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక మరణాల నిలపుదలకు రాజకీయాలకు అతీతంగా లక్షలాదిమంది ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు.

