బావుపేట గ్రామంలో స్వచ్ఛత హీ సేవ – 2026 కార్యక్రమం.
ఎంపీడీవో విజయ్ కుమార్
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
స్వచ్ఛత హీ సేవ 2026 లో జిల్లా కలెక్టర్, సిఇఓ, డి ర్ డి ఓ, డిపిఓ ఆదేశాలలో భాగంగా ఈరోజు ఎల్కతుర్తి మండలం భావుపేట గ్రామంలొ ఎంపీడీవో,ఏంపిఓ, ఏపిఓ, మరియు స్వచ్ఛభారత్ ప్రతినిధి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ స్కూల్ ప్రాంగణంలో భారీ శ్రమదానం స్వచ్ఛతపై అవగాహన ప్రతిజ్ఞ మొదలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎంపిడిఓ విజయ్ మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛత సేవా కార్యక్రమాలు 17 నుండి oct 2 వరకు శ్రమదానాలు నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. స్వచ్ఛభారత్ ప్రతినిధి సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భాగస్వాములై పిల్లల నుంచి పెద్దల వరకు స్వచ్ఛత పైన అవగాహన పెంచి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత ఉంచుకోవాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్ గారు సర్పంచ్,ఏంపిఓ గణపతి,ఏపీవో అనితా ఇసి శ్రీకాంత్,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ప్రతినిధి సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి,మహిళలు,సిబ్బంది ఇసి ఈజీఎస్ సిబ్బంది అన్ని గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొనడం జరిగింది.

