📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHyderabadగణేష్ మండపం వద్ద ఘనంగా సన్మాన కార్యక్రమం

గణేష్ మండపం వద్ద ఘనంగా సన్మాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

గణేష్ మండపం వద్ద ఘనంగా సన్మాన కార్యక్రమం
బీజేఆర్ నగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ప్రజావాణి): బీజేఆర్ నగర్ గౌడ సంఘం సహాయ కార్యదర్శి దుబ్బాక నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భాగంగా గణేష్ మండపం వద్ద కుల పెద్దమనుషులు, కార్పొరేటర్లు, సూర్యనగర్ కాలనీవాసులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ, సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కుల పెద్దమనుషులు, కార్పొరేటర్లు, కాలనీవాసులకు గౌడ సంఘం ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.