📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవృద్ధ మహిళ గాదరి అయిలమ్మకు రక్షణ కల్పించండి---

వృద్ధ మహిళ గాదరి అయిలమ్మకు రక్షణ కల్పించండి—

📰 Generate e-Paper Clip

*వృద్ధ మహిళ గాదరి అయిలమ్మకు రక్షణ కల్పించండి—

జవహర్ నగర్ సెప్టెంబర్ 19( ప్రజావాణి ప్రతినిధి)

పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేసిన ప్రజాసంఘాల నాయకులు.
70 సంవత్సరాల వృద్ధురాలిపై దాడికి పాల్పపడిన కొడుకు, కోడలు, మనుమరాళ్ళు.

గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న 70 సంవత్సరాల ఒంటరి వృద్ధురాలు గాదరి అయిలమ్మపై 55 సంవత్సరాల కుమారుడు ఎల్లయ్య, బార్య పుష్ప, కూతుళ్ళు సోని అంకిత మరియు పుష్ప అక్క పద్మ మొత్తం ఐదుగురు కలిసి దాడికి పాల్పడి, తీవ్రంగా హింసించి, కొప్టడమే గాకుండా, ఇంటిపైకప్పు రేకులను, సామాన్లను ద్వంసం చేసిన వారిపై స్థానిక కీసరసర్కీల్ లోని జవహర్ నగర్ పోలీసు అధికారులు వాహనాలు వెంటనే తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన దారణం తెలుసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకురాలు ఇంద్ర ఆధ్వర్యంలో ఇఫ్టూనేత షేక్ షావలి, మహేశ్వరం, బడంగిపేట కాంగ్రెసస్ మహిళా నాయకురాలు, శోషల్ వర్కర్ అమృత నాయుడు సంయుక్తంగా 2026, సెప్టెంబర్-19, శనివారం రోజు, గబ్బిలాలపేటలో నివాసం ఉంటున్న మహిళా వృద్ధురాలిని కలిసి పరామర్శించారు. గత 10 సంవత్సరాలుగా తల్లి, కొడుకు కుటుంబ సభ్యుల మధ్య వివాధాలు ఉన్నాయని బస్తివాసులు తెలియజేశారని అన్నారు. వృద్ధురాలి భర్త యాదయ్య చనిపోయిన తర్వాత ఎవరిమీద ఆధారపడకుండా గాయగూరల వ్యాపారం చేసుకొంటూ సొంత ఇంటిలో జీవిస్తున్నదని అన్నారు. వీరి కుమారుడు, కోడలు, పిల్లలు మంత్రాలు, తంత్రాలు, చేతబడులు వంటి మూడ అందవిశ్వాలతో నాలుగు ఇళ్ళను అమ్ముకొని, అప్పుల పాలయ్యారని అన్నారు. అప్పులు తీర్చడానికి వృద్ధురాన్ని ఇంటి నుండి గెంటివేసి, ఇంటిని అమ్ముకోవడానికి నాలుగు రోజుల కిందట అమానవీయమైన చర్యలకు పాల్పపడడంతో సభ్య సమాజానీకే సిగ్గుచేటయిన విషయమని అన్నారు. వెంటనే దాడికి పాల్పడి, మానసిక, శారీరక క్షభకు గురిచేస్తున్న ఎల్లయ్య కుటుంబం పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.