📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonపాండ్యాల అంజయ్య కుటుంబాన్ని పరామర్శించిన సిపిఎం నేతలు

పాండ్యాల అంజయ్య కుటుంబాన్ని పరామర్శించిన సిపిఎం నేతలు

📰 Generate e-Paper Clip

*పాండ్యాల అంజయ్య కుటుంబాన్ని పరామర్శించిన సిపిఎం నేతలు*

*జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19 (ప్రజావాణి):*

జిల్లాలోని తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన సిపిఎం మండల కార్యదర్శి పాండ్యాల అంజయ్య మాతృమూర్తి పాండ్యాల సోమమ్మ వృద్ధాప్యంతో ఇటీవల మృతి చెందారు.
సోమమ్మ మృతి నేపథ్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, సిపిఎం చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్, మండల కమిటీ సభ్యులు తరిగొప్పులలోని అంజయ్య నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సోమమ్మ మృతికి సంతాపం తెలిపి, అంజయ్య కుటుంబ సభ్యులకు సిపిఎం జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పరామర్శించిన వారిలో సిపిఎం చిల్పూర్ మండల నాయకులు సిఐటియు మండల కన్వీనర్ అపారదాపు రాజు, రైతు సంఘం మండల అధ్యక్షులు ఊరడి లింగయ్య, కర్రె నాగరాజు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.