📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamకూసుమంచిలో ఘోర రోడ్డు ప్రమాదం

కూసుమంచిలో ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

*కూసుమంచిలో ఘోర రోడ్డు ప్రమాదం.*

*వ్యక్తి మృతి.. కూతురికి తీవ్ర గాయాలు.*

*కూసుమంచి, ప్రజావాణి న్యూస్,సెప్టెంబర్ 14:*

కూసుమంచి మండలంలోని సంత రోడ్డులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పెద్దపోచారం గ్రామానికి చెందిన సట్టు శ్రీను (45) అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కూతురికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దపోచారం గ్రామానికి చెందిన సట్టు శ్రీను నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు కూసుమంచి గ్రామానికి వచ్చారు. కొనుగోళ్లు పూర్తి చేసుకుని తన కూతురితో కలిసి ద్విచక్రవాహనంపై తిరిగి పెద్దపోచారం గ్రామానికి వెళ్తుండగా సంత రోడ్డులో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.అదే వాహనంపై ఉన్న ఆయన కూతురు నిషిత (16)తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో సంత రోడ్డులో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న కూసుమంచి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కూసుమంచి ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.