మధ్యలో చదువు మానేసిన వారికి TOSS సువర్ణావకాశం
మేడ్చల్: మధ్యలో చదువు మానేసిన విద్యార్థులు, పెద్దయ్యాక తిరిగి చదువుకోవాలనుకునే వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ద్వారా మరోసారి విద్యను కొనసాగించే అవకాశం లభిస్తోంది. 15 సంవత్సరాలు పూర్తయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
మేడ్చల్ మండలంలోని అత్వెల్లి ఉన్నత పాఠశాలలో TOSS-2026 అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. చదువు మధ్యలో నిలిపివేసిన వారు, వివిధ కారణాలతో విద్యను కొనసాగించలేకపోయిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో తమ విద్యను పూర్తి చేసుకోవచ్చు.
అడ్మిషన్ కోసం ఆధార్ కార్డు, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం రెండేసి కాపీలు, అలాగే రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని అత్వెల్లి ఉన్నత పాఠశాలను సంప్రదించాలి. మరిన్ని వివరాల కోసం TOSS కోఆర్డినేటర్ గడప నవీన్ – 9392585259ను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా అత్వెల్లి ఉన్నత పాఠశాలలో TOSS-2026 కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు మాణిక్యాలరావు ఆవిష్కరించారు. విద్యకు వయస్సు అడ్డంకి కాదని, చదువు కొనసాగించాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

