📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పెన్షన్ దారులకు గడువు పెంచాలి సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ డిమాండ్ 

పెన్షన్ దారులకు గడువు పెంచాలి సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ డిమాండ్ 

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల సెప్టెంబర్ 10 ప్రజావాణి  వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, డప్పు, చర్మ కళాకారులకు ,పింఛన్ గడువు 30 రోజుల కేటాయించాలని సిపిఐ వారం వ్యవధిలో ప్రభుత్వ సర్టిఫికెట్లు ఎలా వస్తాయి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులను గుర్తించి గడువు పెంచే ఆలోచన చేయాలని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్ లు విలేకరుల సమావేశంలో పాలక కూటమి ప్రభుత్వం నెలరోజులు గడువు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం కల్పించడం సంతోషకరమే కానీ వారికి ఇచ్చిన గడువు కుల ధ్రువీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్, ప్రభుత్వ అధికారులు ఇవ్వాలంటే 30 రోజులు గడువు ఉంటుంది అదికాక మూడు రోజులు నాలుగు రోజులు సెలవులు ఉండడం,సెలవులు అయిపోతే గడువు కూడా అయిపోతుంది అలాంటప్పుడు పెన్షన్ దారులకు మీరు ఎలా న్యాయం చేస్తారు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పునర్ ఆలోచన చేసి గడువు నెల రోజులు ఇవ్వాలని, తెలిపారు. సచివాలయంలో,తాసిల్దార్ కార్యాలయంలో విఆర్వోలు, ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు అలాగే తాసిల్దార్ కార్యాలయంలో సర్వరు ప్రాబ్లం,ఆన్లైన్ పనిచేయడం లేదు, సిస్టం సరిగా లేదు అని సచివాలయం సిబ్బంది పెన్షన్ దారులు వృద్ధులు,వికలాంగులను,దళిత డప్పు కళాకారులు,చర్మకారులకు సమయం తక్కువ ఉన్నందువలన అప్లై కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని వారు ఆవేదన పొందుతున్నారు.వెంటనే కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క పింఛన్దారునికి పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,సచివాలయానికి కొన్నే అని,ఆంక్షలు పెట్టి, అర్హులైన వారి నోట్లో మట్టి కొట్టవద్దని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కోడూరు కేశవ,ఏరియా కార్యవర్గ సభ్యులు జాకోబ్,పిడుగు పేరయ్య,సనమాల చెన్నయ్య,నరసింహులు ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.