కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోతాత మధు దిష్టిబొమ్మను దహనం
* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన
* ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దొగ్గల భాస్కర్ పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాతకాల అనిల్ ఆధ్వర్యంలో
జమ్మికుంట సెప్టెంబర్ 8 (ప్రజావాణి)
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలోతెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, జమ్మికుంట ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దొగ్గల భాస్కర్ పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాతకాల అనిల్ ఆధ్వర్యంలో తాత మధు దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగిందిరాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమే. రాజకీయ విమర్శలు చేయడంలో తప్పు లేదు కానీ, వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడటం ఏమాత్రంసమర్థనీయంకాదుప్రజాస్వామ్యంలో పదవులకు గౌరవం ఉండాలిరాజకీయాల్లో హుందాతనం ఉండాలిఅనుచిత వ్యాఖ్యలకు ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం ఇస్తాంస్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాంఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మొలుగురు సదయ్య, టిపిసిసి ప్రచార కమిటీ మెంబర్ సాయిని రవి, జమ్మికుంట కౌన్సిలర్ దిద్ది రాము, ఒగ్గు రమేష్, ఎస్సి సెల్ జనరల్ సెక్రెటరీ దొడ్డ శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ పార్లపల్లి నాగరాజు, జమ్మికుంట దుబ్బ మల్లన్న చైర్మన్ ముద్దమల్ల రవి, జిల్లా కార్యదర్శి మకమల్ల అశోక్,ఎన్ఎస్ఐ మండల అధ్యక్షులు వాసాల సుధీర్, బోయిని రాజ్ కుమార్,రాచపల్లి శ్రీనివాస్, పంజాల అజయ్, కొండు బిక్షపతి, రోమాల రాజ్ కుమార్,శంకర్, నరసన్న,మైస రమేష్,అనిల్,పాతకల ప్రవీణ్, గుల్లి జపానియా, రమేష్, శివ, ములుగురు సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
