📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetకేసీఆర్ ఫామ్‌హౌస్‌ ముట్టడికి పోటెత్తుతున్న కాంగ్రెస్ శ్రేణులు

కేసీఆర్ ఫామ్‌హౌస్‌ ముట్టడికి పోటెత్తుతున్న కాంగ్రెస్ శ్రేణులు

📰 Generate e-Paper Clip

కేసీఆర్ ఫామ్‌హౌస్‌ ముట్టడికి పోటెత్తుతున్న కాంగ్రెస్ శ్రేణులు

 

 

 

బెజ్జంకి, సెప్టెంబర్ 8 (ప్రజావాణి)

 

 

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కేసీఆర్ ఫామ్‌హౌస్‌ ముట్టడి కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డప్పులతో నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చేర్మెన్ పులికృష్ణ, ముక్కిస రత్నాకర్ రెడ్డి, జేల్లా ప్రభాకర్, రావుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.