📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetభారీ వర్షాలకు అలుగు పారుతున్న చెరువులు. కుంటలు

భారీ వర్షాలకు అలుగు పారుతున్న చెరువులు. కుంటలు

📰 Generate e-Paper Clip

భారీ వర్షాలకు అలుగు పారుతున్న చెరువులు. కుంటలు

పంటలకు ప్రాణం పోసిన వర్షాలు.

రాయపోల్ సెప్టెంబర్ 14. (మన ప్రజావాణి)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వలన వర్షాలు భారీగా కురవడంతో సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు కుంటలకు భారీగా నీరు చేరి అలుగు పాడుతున్నాయి. రైతులు వేసిన పంటలు ఎండిపోయే దశలో తుఫాన్ తో వర్షాలు క్రూడంతో అన్నదాత వేసిన పంటలకు ఊపిరి పోసింది. దీంతో రైతులు ఎంతో సంతోషపడి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి రైతన్న పంటలు సాగు చేశాడు. అయితే వర్షాలు సకాలంలో పడకపోవడంతో నిత్యం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి రైతుకు ఏర్పడింది. ఈ క్రమంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం ద్వారా అటు చెరువుల కుంటల్లోకి నీరు రావడం. ఇటు రైతులు వేసిన పంటలకు వర్షాలు జీవం పోయడంతో వానకాలం సాగు పై రైతులకు భరోసా కలిగింది. ఇప్పటికే రాయపోల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని టెంకంపేట. కొత్తపల్లి. రాయపోల్ నల్లచెరువు తో పాటు పలు గ్రామాల్లో కుంటలు చెరువులు మత్తడి దుంగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వలన వర్షాలు కురవడంతో రైతులు వేసిన పంటలకు ఆశలు చిగురించాయి. మొక్కజొన్న. వరి. పత్తి ఇతర పంటలకు వర్షాలు ఎంతో మేలు చేకూరాయి. దీంతో రైతన్నలు వ్యవసాయ పనులో నిమగ్నమై ఉండగా అందుకు తగ్గట్టుగా యూరియా అవసరం ఉండగా యాప్ తో రైతులు నాన్న తంటలు పడుతున్నారు. యూరియా ప్రస్తుతం అవసరం ఉండగా యాప్ తో రైతులకు యూరియా సకాలంలో దొరకకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు యూరియా అందే విధంగా చర్య తీసుకోవాలని మండల రైతులకు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.