పరకాల సీఐ ప్రవీణ్ కుమార్కు ఘన సన్మానం
ప్రజావాణి ప్రతినిధి నవీన్ బ్యూరో హనుమకొండ సెప్టెంబర్ 4
హనుమకొండ జిల్లా, పరకాల: పరకాల సీఐగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ను తెలంగాణ ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బొచ్చు కరుణాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బొచ్చు కరుణాకర్ మాట్లాడుతూ, ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పరకాల ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా సీఐ ప్రవీణ్ కుమార్ సేవలు అందించాలని ఆకాంక్షించారు.
పరకాల ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించాలని, ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా కోరారు. సీఐ ప్రవీణ్ కుమార్కు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయిలు అందాలని బొచ్చు కరుణాకర్ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

