
ఆదిరెడ్డి పార్థివదేహానికి చల్లా ధర్మారెడ్డి నివాళి
కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి
ప్రజావాణి ప్రతినిధి నవీన్ బ్యూరో
: హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చందుపట్ల ఆదిరెడ్డి మృతిచెందిన విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆదిరెడ్డి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

