సేవాస్ఫూర్తితో ఘనంగా కోనేరు శశాంక్ జన్మదిన వేడుకలు.
30 మంది నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహయం అందజేత.
ఆడపడుచులకు జన్మదినం సందర్భంగా చీరల పంపిణీ.
రాఖీలు కట్టి కోనేరు శశాంక్ కు శుభాకాంక్షలు తెలిపిన ఆడపడుచులు.
కేజీబీవీ పాఠశాలలో కోనేరు శశాంక్ జన్మదిన వేడుకలు.


కోటగిరి/ప్రజావాణి:-ఎన్నారై బాన్సువాడ నియోజక వర్గ బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ జన్మదిన వేడుకలు శుక్రవారం కోటగిరి మండల కేంద్రంలోని కోనేరు ట్రస్ట్ భవనంలో ఘనంగా నిర్వహించారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానుల సమక్షంలో కోనేరు శశాంక్ కేక్ కట్ చేసి జన్మ దిన వేడుకలు వేడుకగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 30 కుటుంబాలకు ఆయన ఆర్థిక సహాయం అందజేశారు.అదేవిధంగా ఆడపడుచులకు చీరలను పంపిణీ చేశారు.రాఖీ పండుగను పురస్కరించు కుని పలువురు ఆడపడుచులు కోనేరు శశాంక్‌కు రాఖీలు కట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కోనేరు ట్రస్ట్ ఆవరణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిం చారు.అదేవిధంగా కోటగిరి కేజీబీవీ పాఠశాలలో ఆయన విద్యార్థులతో రాఖీలు కట్టించుకుని,వారికి స్వీట్లు పంపిణీ చేస్తూ జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.భవిష్య త్తులో కోనేరు శశాంక్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజ లకు మరింత చేరువకావాలని ఆకాంక్షించారు.ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు సుఖ సంతోషా లు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ జన్మదిన శుభా కాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కోనేరు శశాంక్ మాట్లాడుతూ.తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల మధ్య,సేవా కార్యక్ర మాలతో జన్మదినాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.పేద కుటుంబాలకు అండగా నిలవడం,విద్యా ర్థులను ప్రోత్సహించడం,మహిళలను గౌరవించడం వంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంబం సర్పంచ్ కుర్లెపు గంగాధర్,ఉప సర్పంచ్ రేపల్లె సాయిప్రసాద్,జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు,జిల్లా కిసాన్ మోర్చా సెక్రటరీ సాయిరెడ్డి,చందూర్ మాజీ ఎంపీటీసీ నర్సింహులు, బాన్సువాడ రూరల్ అధ్యక్షులు శ్రీను, కోటగిరి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ఏముల నవీన్,రుద్రూర్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు హరికృష్ణ,సీనియర్ నాయకులు పుల్లెల మోహన్ రావు, మహిళా మోర్చా నాయకురాలు శ్యామల కులకర్ణి,మామిడి శ్రీనివాస్, మామిడి రవి,మామిడి సాయిలు, ఓమన్న పటేల్,ప్రకాష్ పటేల్, దావులయ్య,నాగేల్లి శ్రీనివాస్,వడ్ల శ్యామ్,పబ్బా శేఖర్,విలాస్,జగదీష్,శ్యామ్, శివశంకర్,సీతారాం నాయక్, బీజేపీ నాయకులు,కార్యకర్త లు,అభిమానులు,మహిళలు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

