📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు స్వీపింగ్ చేసిన వెంటనే చెత్త తొలగించాలి కమిషనర్

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు స్వీపింగ్ చేసిన వెంటనే చెత్త తొలగించాలి కమిషనర్

📰 Generate e-Paper Clip

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు –

స్వీపింగ్ చేసిన వెంటనే చెత్త తొలగించాలి -కమిషనర్

అనంత పురం బ్యూరో ఆగస్టు 20 మన ప్రజా వాణి
నగరపాలక సంస్థ కమిషనర్ యం జస్వంత రావు  రోజువారీ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా ఈరోజు రహమత్ నగర్‌లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
అనంతపురం నగరంలోని పలు ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లలో నగరపాలక సంస్థ కమిషనర్ చాలాసార్లు గమనిచడం జరిగింది.ఈ పరిశీలనలో ప్రధానంగా గమనించిన అంశం ఏమిటంటే, పారిశుద్ధ్య కార్మికులు ఉదయం రోడ్లపై స్వీపింగ్ చేసిన తర్వాత ఊడ్చిన చెత్తను, దుమ్మును చిన్న చిన్న కుప్పలుగా రోడ్ల పక్కన ఉంచుతున్నారు. ఆ కుప్పలను వెంటనే తొలగించి డస్ట్ బిన్ లో వేయకపోవడం వల్ల, వాహనాల రాకపోకలు  గాలులకు ఆ చెత్త మళ్లీ రోడ్లపై చెల్లాచెదురుగా పడిపోతున్నది. దీనివలన ఇప్పటికే శుభ్రం చేసిన రోడ్లు మళ్లీ అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు స్వీపింగ్ చేసిన వెంటనే, ఎక్కడికక్కడ చెత్త కుప్పలను తప్పనిసరిగా ఎత్తి దగ్గరలోని డస్ట్ బిన్ లో వేయాలి. రోడ్డుపై కుప్పలుగా ఉంచరాదు. స్వీపింగ్ పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా, స్వీపింగ్ చేస్తూనే వెంటవెంటనే చెత్తను ఎత్తాలి..ప్రతి శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటేషన్ సెక్రటరీ తమ పరిధిలోని వార్డులలో ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి. ఈ నిబంధనను పాటించని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోబడను కమిషనర్ గారు ఆదేశించారు.నగరాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛ అనంతపురంగా ఉంచేందుకు ప్రతి కార్మికుడు బాధ్యతతో పనిచేయాలని, ప్రజలు కూడా రోడ్లపై చెత్త వేయకుండా సహకరించాలని కమిషనర్  ఈ సందర్భంగా కోరారు.
అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ యం జస్వంత రావు పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక జూనియర్ కాలేజీ కూడలిలోని అన్నా క్యాంటీన్ ను గురువారం సందర్శించారు. అన్నా క్యాంటీన్ లో ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను కమిషనర్ తనిఖీ చేశారు. క్యాంటీన్ కు విచ్చేసిన ప్రజలతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడి ఆహార నాణ్యతను, నిర్వాహకుల వ్యవహార శైలిని అడిగి తెలుసుకున్నారు.క్యాంటీన్ ప్రాంగణంలో తాగునీటి వసతి, మరుగుదొడ్లు నిర్వహణ తీరును పరిశీలించారు. క్యాంటీన్ పరిసరాలలో పారిశుద్ధ్య నిర్వహణ తప్పనిసరిగా పాటిస్తూ నిర్దేశించిన ప్రమాణాలను క్యాంటీన్ నిర్వాహకులు చేపట్టాలని కమిషనర్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.