గరుడ సేవకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు.. ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు
తిరుపతి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి): శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 19న నిర్వహించనున్న గరుడ వాహన సేవకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక పార్కింగ్, భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, టీటీడీ, విజిలెన్స్, ఆర్టీసీ తదితర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్ తెలిపారు.
గరుడ సేవకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
RELATED ARTICLES

