📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షల నిర్వహణ..

ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షల నిర్వహణ..

📰 Generate e-Paper Clip

ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షల నిర్వహణ..

-పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి

-డిఆర్ఓ ఏ.మలోల..

అనంతపురం బ్యూరో ఆగస్టు 20 , మన ప్రజా వాణి
ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఏపీ పవర్ యుటిలిటీస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని డిఆర్ఓ ఏ.మలోల ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని డిఆర్ఓ చాంబర్ లో ఆంధ్రప్రదేశ్ పవర్ యుటిలిటీస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పరీక్షలపై సంబంధిత అధికారులతో డిఆర్ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో 06 కేంద్రాలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పరీక్షలను ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. 1.బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం గ్రామం వద్దనున్న శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SRIT), 2.అనంతపురం రూరల్ మండలం ఇటుకలపల్లి గ్రామం వద్దనున్న అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, 3.తాడిపత్రి మండలంలోని కడప రోడ్ లో ఉన్న తాడిపత్రి ఇంజనీరింగ్ కాలేజ్, 4.అనంతపురం అర్బన్ లోని రుద్రంపేట వద్దనున్న పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 5.తాడిపత్రి మండలంలోని సర్ సి.వి.రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, 6.రాప్తాడు మండలం ఎల్.ఆర్.జి స్కూల్ వద్దనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ ద చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా కేంద్రాలలో పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు  మధ్యాహ్నం 02:30 గంటల నుంచి సాయంత్రం 05:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించడానికి శాంతిభద్రతలు, వైద్య సహాయం, రవాణా, విద్యుత్ సరఫరా, పర్యవేక్షణ  సమగ్ర సమన్వయం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వెలుపల ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అన్ని కేంద్రాలలో శాంతిభద్రతలను కాపాడటం, జనసమూహాలను నియంత్రించడం, అభ్యర్థుల క్రమబద్ధమైన ప్రవేశాన్ని కల్పించడం చేయాలని, అన్నిచోట్ల సెక్షన్ 144ను అమలు చేయాలని, అన్ని పరీక్షా కేంద్రాలలో నిరంతరాయ విద్యుత్ సరఫరాను చేయాలని, పరీక్షా కేంద్రాలు ఉన్న దగ్గర ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని, అన్ని పరీక్షా కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.