గంగానగర్ లో ఎమ్.ఎస్.పి (M.S.P) నూతన కమిటీ ఎన్నిక
గోదావరిఖని ఆగస్టు16 ప్రజావాణి :
వచ్చే సెప్టెంబర్ 9న నిర్వహించనున్న ఎమ్ఆర్పీఎస్ (MRPS) జాతీయ సదస్సును మహోద్యమంలా జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సదస్సు నిర్వహణ కో-ఇంచార్జ్ కాంపెల్లి శ్రీనివాస్ అధ్యక్షతన గంగానగర్ MSP నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… దళిత, బహుజన వర్గాల హక్కుల పోరాటంలో mrps జాతీయ సదస్సు కీలక మలుపు కానుందని తెలిపారు. రాబోయే రోజుల్లో విస్తృత ప్రచారం నిర్వహించి, కార్యకర్తలను, ప్రజలను పెద్ద ఎత్తున సమీకరిస్తామని స్పష్టం చేశారు.
నూతన కార్యవర్గం: అధ్యక్షుడు: మచ్చఎల్లస్వామి ఉపాధ్యక్షులు: ఇప్ప శ్రీనివాస్, చిలుముల శంకర్, ప్రధాన కార్యదర్శి: సుద్దాల రమేష్, గౌరవ సలహాదారు: తిప్పారపు మధనయ్య, కార్యవర్గ సభ్యులు: మడిపెల్లి మధునయ్య, చిలుక నర్సయ్య, బెజ్జంకి రమేష్, మడిపెల్లి ఉదయ్ గోలేటి విజయ్
ఈ కార్యక్రమంలో మడిపెల్లి దశరథం కమాన్పూర్ ఇంచార్జ్, కాసిపేట రాజయ్య అంతర్గాం ఇంచార్జ్, కో-ఇంచార్జ్ లు కాసిపేట సదానందం, రాచర్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన బాధ్యులకు ఈ సందర్భంగా నాయకులు, శుభాకాంక్షలు తెలిపారు.
