కాశి నాయన మండలం ఆగస్టు 15 ప్రజావాణి ఇటుకులపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు,ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు,పార్టీ నాయకులు,పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సొసైటీ బ్యాంకు చైర్మన్ చిన్న గురువురెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం జాతీయ గీతం ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ,దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి భావాలను చాటుకున్నారు. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేలా వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ మరియు ఉపాధ్యాయులు ఆనంద్ బహుమతులు అందజేశారు. దీంతో విద్యార్థుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పార్టీ నాయకులు,పెద్దమనుషులు,పాఠశాల సిబ్బంది, విద్యార్థులు,తల్లిదండ్రులు,గ్రామస్తులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.
ఇటుకులపాడు జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు :
RELATED ARTICLES

