📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్బెజ్జంకి ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం -బెజ్జంకి ఎంపీడీవో ప్రవీణ్

బెజ్జంకి ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం -బెజ్జంకి ఎంపీడీవో ప్రవీణ్

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, ఆగస్టు 14 (ప్రజావాణి)

మండల స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు బెజ్జంకి ఎంపీడీవో కడివేర్గు ప్రవీణ్ ప్రకటనలో తెలిపారు.ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన 23 లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.ప్రజల నుంచి అందిన వినతులను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు.బెజ్జంకి
మండలలోని ఆయా గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో ప్రవీణ్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.