📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadవడ్డేరా కాలనీలో  లో ఘనంగా నల్ల పోచమ్మ తల్లి బోనాలు

వడ్డేరా కాలనీలో  లో ఘనంగా నల్ల పోచమ్మ తల్లి బోనాలు

📰 Generate e-Paper Clip

* *.*

*వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ కు బోనాలు సమర్పణ.*

నస్రుల్లాబాద్ ఆగస్టు 11 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారము వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ అమ్మవారు అనుగ్రహం కృప కటాలక్షాలతో భక్తులను సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వడ్డెర సంఘం వారు ఆకాంక్షించారు. అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం వైభవంగా ప్రారంభించారు. వడ్డెర సంఘం ఆధ్వర్యంలో మహిళలు సంప్రదాయ దుస్తులతో బోనాలను అలంకరించి ప్రతి ఇంటి నుంచి బోనాన్ని ఎత్తుకొని మహిళలు ఆలయానికి బయలుదేరి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. శివశక్తులు పునాకాలు పోతరాజుల విన్యాసాలు యువకులు కేరింతలు డీజే బోనాలు. ఘనంగా నిర్వహించారు. వడ్డెర  కులస్తులంతా పోచమ్మ తల్లికి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ మాట్లాడుతూ వర్షాలు బాగా కురిపించి. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలత ఆయురారోగ్యాలతో  వర్ధిల్లాలి చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించారు. పోచమ్మ ఆలయం ప్రాంగణంలో భక్తులతో సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం కులస్తులు,. మహిళలు, యువత, కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.