📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJayashankar Bhupalpallyకలగానే మిగిలిన గర్మిళ్లపల్లి-ఓడేడు వంతెన

కలగానే మిగిలిన గర్మిళ్లపల్లి-ఓడేడు వంతెన

📰 Generate e-Paper Clip

కలగానే మిగిలిన గర్మిళ్లపల్లి-ఓడేడు వంతెన

టేకుమట్ల/ ప్రజావాణి

టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామం మరియు ఓడేడు ఇరువురి గ్రామాల మధ్య మానేరు వాగు పై నిర్మించిన వంతెన నిర్మాణ పనులు దాదాపు 2016 ఆగష్టు లో 49 కోట్లతో శంకుస్థాపన చేశారు అయిన ఇప్పటికి ఈ యొక్క వంతెన నిర్మాణ పనులు అసంపూర్తి గానే మిగిలింది.ఈ యొక్క వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం వలన ప్రయాణికులు దాదాపు 100 కి/మీ దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తుంది. అలాగే రైతులు మరియు గీత కార్మికులకు వారి జీవనోపాధిపైన తీవ్ర ప్రభావం పడింది.ప్రతి వర్షాకాలంలో ఇదే పునరావృత మవుతుంది అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజల ప్రాణాలు మరియు రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి శాశ్వత పరిష్కారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.