గంజాయి స్మోకర్స్ పట్టివేత డి-అడిక్షన్ కు తరలింపు
ఎస్సై రమేష్ బాబు
ప్రజావాణి,నెల్లికుదురు:గంజాయి స్మోకింగ్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి డి-అడిక్షన్ కేంద్రం (మత్తుపదార్థాల వ్యసన విముక్తి కేంద్రం) కు తరలించిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లో చోటుచేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం నెల్లికుదురు మండలం దుర్గాభవాని తండా క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఐకెపి సెంటర్ స్థలంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి స్మోకింగ్ చేస్తున్నారనే సమాచారం అందింది. ఈ మేరకు బుధవారం తమ సిబ్బందితో వెళ్లి స్మోకింగ్ కు పాల్పడుతున్న ఆలేరు గ్రామానికి చెందిన దిడ్డి కార్తీక్, మహబూబాబాద్ మండలం కేవ్ల తండ కు చెందిన బాధావత్ మోహన్ లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి పంచుల సమక్షంలో గంజాయి కిట్టుతో టెస్ట్ చేయడంతో పాజిటివ్ వచ్చింది. దీంతో వాళ్ళిద్దరిపై కేసు నమోదు చేసి, మహబూబాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, తొర్రూరు కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.కోర్టు ఆదేశాల మేరకు మహబూబాబాద్ లోని డి అడిక్షన్(మత్తు పదార్థాల వ్యసన విముక్తి కేంద్రం)కు తరలించి అప్పగించినట్లు ఎస్సై వెల్లడించారు.గంజాయి తాగిన, విక్రయించే వారి గురించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని,వారికీ ఎస్పి చేతుల మీదుగా నగదు రివార్డు అందజేయబడుతుందని తెలిపారు.
గంజాయి స్మోకర్స్ పట్టివేత డి-అడిక్షన్ కు తరలింపు ఎస్సై రమేష్ బాబు
RELATED ARTICLES




