📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
HomeతెలంగాణMahabubabadఇనుగుర్తి కి రెండు కోట్లతో తాసిల్దార్ కార్యాలయము

ఇనుగుర్తి కి రెండు కోట్లతో తాసిల్దార్ కార్యాలయము

📰 Generate e-Paper Clip

‘ఇనుగుర్తి’కిరూ.2కోట్లతో’తహసీల్’కార్యాలయం
‘భూ’పరిశీలన చేసిన అదనపు కలెక్టర్ అనిల్ కుమార్
ప్రజావాణి,ఇనుగుర్తి:మండల కేంద్రం ఇనుగుర్తికి మంజూరైన తహసిల్దార్ కార్యాలయం నిర్మాణానికి జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ బుధవారం భూ పరిశీలన చేశారు.సుమారు రూ.2 కోట్లతో మోడల్ తహసిల్దార్ కార్యాలయం నిర్మించనున్న నేపథ్యంలో ఏ సిటీ నిర్మాణం కోసం కేటాయించిన భూమి పక్కనే 1-20 గుం.(ఒక ఎకరం 20 గుంటలు) స్థలం కేటాయించారు.స్థానిక తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు,ఎంపీడీవో పార్థసారధి,సర్పంచి తమ్మడపల్లి కుమార్ తదితరులతో క్షేత్రస్థాయిలో సందర్శించిన అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక హంగులతో మోడల్ తహసిల్దార్ ఆఫీస్ నిర్మించనున్నట్లు తెలిపారు. సంబంధిత భూమిని త్వరగా చదును చేయాలని సూచించారు. గతంలో ఏటీసీకి కేటాయించిన స్థలాన్ని సైతం వేగంగా చదును చేసి స్వాధీనపరచాలన్నారు. తహసీల్దార్  శ్రీనివాసులు మాట్లాడుతూ తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటు కోసం సర్వేనెంబర్ 1196లో భూమి కేటాయించగా, దీనిని డి ఐ లూ ర్ధు సర్వే చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ బషీర్, జిపిఓ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular