నీటి సంరక్షణ ఇంకుడు గుంతలతోనే సాధ్యం
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
వర్షపు ప్రతీ నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే దిశగా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు.
బుధవారం మధిర నియోజకవర్గం మదిగొండ మండలం యడవల్లి లక్ష్మీపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ బైక్ పై ప్రయాణించి పంట పొలాల్లో నీటి కుంటలు, పంట కుంటలు, ఊట కుంటలు, గ్రామంలో నిర్మించే సామాజిక ఇంకుడు గుంతలు, ఫాం పాండ్, నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ వర్షపు ప్రతీ నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు ఊట కుంటలు (పర్కొలేషన్ ట్యాంకు లు), పంట కుంటలు (ఫార్మ్ పాండ్స్), బోర్బావుల రీఛార్జ్ నిర్మాణాలను విసృ తంగా చేపట్టాలని ఆదేశించారు. ఫార్మ్ పాండ్స్ వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని, అర్హులైన రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఫార్మ్ పాండ్స్, బోర్ బావుల రీచార్జ్ పనులు చేపట్టేలా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు బోర్ బావుల రీచార్జ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
భూగర్భ జలాల పెంపు, నీటి వృథా నివారణపై ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకురావాలని తెలిపారు. గ్రామపంచాయతీలలో అధికారులు స్థానిక సర్పంచ్ ఇతర వార్డు సభ్యులు, ఎల్నినో వాతావరణ పరిస్థితుల గురించి ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతీ గ్రామపంచాయతీలో నిర్దేశిత లక్ష్యం మేరకు పంట కుంటలు, ఇంకుడు గుంతలు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సరైన పంట విత్తనాలు ఎలా ఎంపిక చేసుకోవాలో రైతులకు వివరించాలన్నారు. వాన నీటి సంరక్షణ చర్యలలో భాగంగా పంట కుంటలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ప్రజలు, రైతులకు తెలియ జేయాలన్నారు. వర్షపు నీటిని సంరక్షిం చుకునే పద్ధతులను విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గ్రామాలలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేపట్టే చర్యలలో భాగంగా ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రక్కన నూతనంగా నిర్మిస్తున్న వీఓ భవనం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ముదిగొండ తహసీల్దారు రవి కుమార్, ఎంపిడివో విజయ, గ్రామ సర్పంచ్ చెరుకుపల్లి స్వాతి, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు.
నీటి సంరక్షణ ఇంకుడు గుంతలతోనే సాధ్యం
RELATED ARTICLES



