📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మృతిచెట్టుకు   ఉరివేసుకుని గుర్తుతెలియని యువకుడు మృతి....

మృతిచెట్టుకు   ఉరివేసుకుని గుర్తుతెలియని యువకుడు మృతి….

📰 Generate e-Paper Clip

చెట్టుకు   ఉరివేసుకుని గుర్తుతెలియని యువకుడు

పలాస ప్రజావాణి ప్రతినిధి

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి–కొబ్బరి చెట్లూరు గేటు మధ్య జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బాదం చెట్టుకు ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు.అనుమాన స్థితిలో మృతదేహం శుక్రవారం వేలాడుతూ  కనిపించింది. స్థానికులు గమనించి స్థానిక కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular