📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
HomeతెలంగాణMuluguమాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి మంత్రి సీతక్క సూచన

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి మంత్రి సీతక్క సూచన

📰 Generate e-Paper Clip

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

.మంత్రి సీతక్క సూచన…సమాజ హితం కోసం అవగాహన కార్యక్రమాలు.

 

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)

 

రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు యువతకు కీలక సూచనలు చేశారు.

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్ నాశనమవుతుందని, కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనాల బారిన పడి యువత జీవితాలు నాశనమవుతున్నాయని ఆందోళన తెలిపారు.

యువత చదువు, క్రీడలు, ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని, సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని సూచించారు.

ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటుందని, అదే సమయంలో పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

 

తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని, స్నేహితులతో ఎలా ఉంటున్నారో గమనించాలని మంత్రి కోరారు.

ఆరోగ్యకరమైన సమాజం కోసం యువత డ్రగ్స్ కి నో చెప్పాలి”అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

 

  • బై రిపోర్టర్‌ గొల్లపెల్లి శ్రీకాంత్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular