📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetమఠంపల్లి లో వేతన శ్రేణి పే స్కేల్ కోసo వి బి జి రామ్ జి...

మఠంపల్లి లో వేతన శ్రేణి పే స్కేల్ కోసo వి బి జి రామ్ జి ఉద్యోగుల పెన్‌డౌన్ మరియు షట్‌డౌన్ నిరసన.

📰 Generate e-Paper Clip

మఠంపల్లి లో వేతన శ్రేణి పే స్కేల్ కోసo వి బి జి రామ్ జి ఉద్యోగుల పెన్‌డౌన్ మరియు షట్‌డౌన్ నిరసన.

 

మఠంపల్లి జూలై 31 (ప్రజావాణి)

 

వేతన శ్రేణి (పే స్కేల్) కోసం వి బి జి రాంజీ ఉద్యోగుల పెన్‌డౌన్ మరియు షట్‌డౌన్ నిరసన కార్యక్రమం మట్టంపల్లి మండలం లో నిర్వహించారు.

వి బి జి రాంజీ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు తగిన వేతన శ్రేణి (పే స్కేల్) మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ఇది బిజీ రాంజీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నుంచి ఉద్యోగులు పెన్‌డౌన్ మరియు షట్‌డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

బిపిజి రాంజీ కార్యక్రమాల అమలులో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తూ, గ్రామీణాభివృద్ధి మరియు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో నిరంతరం సేవలందిస్తున్నప్పటికీ, తమకు తగిన వేతన శ్రేణి లేకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.

ప్రభుత్వం వెంటనే వి బి జి రాంజీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను పరిశీలించి, తగిన పే స్కేల్ మంజూరు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించే వరకు శాంతియుతంగా తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని జేఏసీ నాయకులు మరియు ఉద్యోగులు స్పష్టం చేశారు.

“మా సేవలకు గుర్తింపు కావాలీ, మా హక్కుగా పే స్కేల్ కావాలి!” అని

విబిజి రాంజీ జేఏసీ ఉద్యోగుల ఐక్య పోరాటం

సమితి వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular