చెట్టుకు ఉరివేసుకుని గుర్తుతెలియని యువకుడు
పలాస ప్రజావాణి ప్రతినిధి
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి–కొబ్బరి చెట్లూరు గేటు మధ్య జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బాదం చెట్టుకు ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు.అనుమాన స్థితిలో మృతదేహం శుక్రవారం వేలాడుతూ కనిపించింది. స్థానికులు గమనించి స్థానిక కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు…