📄 ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyతెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

*తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు*
*ఫరూఖ్‌నగర్ యాదవ కాలనీ బోనాల వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్*
షాద్‌నగర్ ప్రజావాణి, జూలై 30: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను భక్తి, ఐక్యతతో నిర్వహించడం సంతోషకరమని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని ఫరూఖ్‌నగర్ యాదవ కాలనీలో నిర్వహించిన బోనాల ఊరేగింపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం భక్తులతో కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు, షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో శాంతి, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్లు పిల్లి శారద శేఖర్, గోపాల్, ఎస్పీ శివ, మాజీ కౌన్సిలర్లు వెంకట్రాం రెడ్డి, యుగంధర్, చిన్న యాదగిరి, నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్, చీపిరి రవి యాదవ్, బిక్షపతి, చెర్క శివ, అశోక్, బాబా ఘోరీ, మహమూద్, నవీన్, సాయి, అభిలాష్, శ్రీనివాస్‌తో పాటు కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular