తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు
*తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు**ఫరూఖ్‌నగర్ యాదవ కాలనీ బోనాల వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్*షాద్‌నగర్ ప్రజావాణి, జూలై 30: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను భక్తి, ఐక్యతతో నిర్వహించడం సంతోషకరమని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని ఫరూఖ్‌నగర్ యాదవ కాలనీలో నిర్వహించిన బోనాల ఊరేగింపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం భక్తులతో కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి...