📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriపోచారం 380వ బూత్‌లో ఎస్‌ఆర్‌ఐ ప్రక్రియపై అవగాహన

పోచారం 380వ బూత్‌లో ఎస్‌ఆర్‌ఐ ప్రక్రియపై అవగాహన

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్ మండల పరిధిలోని పోచారం డివిజన్ 380వ బూత్‌లో ఎస్‌ఆర్‌ఐ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓ మంజులతో కలిసి ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ ఎన్యూమరేషన్ ఫారాలను ప్రజలకు అందజేశారు.

ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ, ఎస్‌ఆర్‌ఐ ప్రక్రియలో బీఎల్‌ఏగా పనిచేయడం అంటే కేవలం ఓటరు జాబితా సవరణ మాత్రమే కాదని, ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు అందేలా చూడడం ఒక గొప్ప ప్రజాస్వామ్య బాధ్యత అని అన్నారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవడం, ప్రజల ఓటు హక్కును పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం బీఎల్‌ఏగా తన బాధ్యత అని తెలిపారు.

ప్రజలు ఎస్‌ఆర్‌ఐ ప్రక్రియలో చురుకుగా పాల్గొని అవసరమైన వివరాలను అందించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఘాట్ కేసర్ మండల డిటి చంద్రశేకర్, ఆర్ ఐ లు సాయి రామ్, కావ్య, జీ పి ఓ లు శ్రవణ్, వెంకటేష్, ప్రజలు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.