పోచారం 380వ బూత్‌లో ఎస్‌ఆర్‌ఐ ప్రక్రియపై అవగాహన

ఘట్‌కేసర్ మండల పరిధిలోని పోచారం డివిజన్ 380వ బూత్‌లో ఎస్‌ఆర్‌ఐ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓ మంజులతో కలిసి ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ ఎన్యూమరేషన్ ఫారాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ, ఎస్‌ఆర్‌ఐ ప్రక్రియలో బీఎల్‌ఏగా పనిచేయడం అంటే కేవలం ఓటరు జాబితా సవరణ మాత్రమే కాదని, ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు అందేలా చూడడం ఒక గొప్ప ప్రజాస్వామ్య బాధ్యత అని అన్నారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవడం, ప్రజల...