📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత: వేముల మహేష్ గౌడ్

ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత: వేముల మహేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూన్ 27: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను విజయవంతం చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అన్నారు.

ఎంఎంసీ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్‌లో గల ఘనపురం, లింగాపూర్, ఇందిరానగర్, పకీర్ టేక్య తండా ప్రాంతాల్లోని 332, 333 బూత్‌ల వద్ద కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడి పేరు నమోదు అయ్యేలా బూత్ స్థాయి ప్రతినిధులు కృషి చేయాలని, ఎలాంటి తప్పులు, లోపాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతి ఓటు కీలకమని, ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధులు వేముల శంకర్ గౌడ్, నానావత్ సురేష్ నాయక్‌తో పాటు బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.