📄 ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘాట్ కేసర్, జూన్ 17:  అన్నోజిగూడ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీం రేవంత్ యువసేన రాష్ట్ర సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించాలని, పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ టి. ప్రతాప్ రెడ్డి, కవిత, రాందాస్, భవాని, అనురాధ, అమరేశ్వరి, పీటీ సార్ విజయ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular