📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్జేఏసీ పిలుపునకు ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు

జేఏసీ పిలుపునకు ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు

📰 Generate e-Paper Clip

విజయవాడ (ప్రజావాణి జూన్ 17)ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికార ప్రతినిధి ఏ.జి.కె. చైతన్య వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) పిలుపు మేరకు, ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం బుధవారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద భారీ ఎత్తున శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధి ఏ.జి.కె. చైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ధర్నా చౌక్‌లో భారీగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల శాంతియుత నిరసన ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధి ఏ.జి.కె. చైతన్య మాట్లాడుతూ.. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,000 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు పాల్గొని జేఏసీ చేపట్టిన ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు.. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవలందిస్తూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ ఉద్యోగ భద్రత, వేతన సవరణ, సమాన హక్కులు వంటి ప్రాథమిక అంశాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.జేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ శాంతియుత నిరసన ప్రభుత్వం దృష్టికి తమ న్యాయమైన డిమాండ్లను తీసుకెళ్లడానికేనని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే జేఏసీ మార్గదర్శకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఎంతో క్రమశిక్షణతో, శాంతియుతంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి అసోసియేషన్ ప్రతినిధులు, జేఏసీ నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళా స్టాఫ్ నర్సులు సుమారు 4000 నుండి 5000 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.