📄 ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialకొత్తపేటలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ అవగాహన సదస్సు

కొత్తపేటలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండలం కొత్తపేటలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ జి.రెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జ్ యోగి జానకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ఆమె ప్రసంగించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అనిల్ కుమార్, సిఐ రాం నర్సింహా రెడ్డి, ఎస్సై ఉదయ్ కుమార్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాలల భవిష్యత్తు కోసం అందరూ బాధ్యతగా మెలగాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular