📄 ePaper
Monday, June 8, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వెన్నుపోటు కు రెండేళ్ళు పై మహిళల తో టౌన్ హాల్ సమావేశం నిర్వహించిన డాక్టర్ జగన్మోహన...

వెన్నుపోటు కు రెండేళ్ళు పై మహిళల తో టౌన్ హాల్ సమావేశం నిర్వహించిన డాక్టర్ జగన్మోహన రావు

📰 Generate e-Paper Clip

నందిగామ జూన్ 08 ప్రజావాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టౌన్ హాల్ సదస్సులో మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు.పాల్గోని ప్రశగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి,ఐదేళ్ల పాలనలో మహిళా సాధికారతకు పెద్దపేట వేసారన్నారు.ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలలో సైతం మహిళలకు తొలి ప్రాధాన్యతని ఇచ్చారని గుర్తు చేశారు. మహిళా సాధికారతలో భాగంగా జగన్మోహన్ రెడ్డి,అమూల్,హిందుస్థాన్ లివర్,ట్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ,రిలయన్స్ తీసుకొచ్చారని,రెండేళ్లలో చంద్రబాబు తీసుకొచ్చింది ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.మహిళలను మోసగించిన బాబు ప్రభుత్వం.చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర మహిళలు మోసగించిన పార్టీ అని ముఖ్యంగా మహిళా సాధికారతకు రెండేళ్లుగా పాత్ర వేశారని ఆయన మండిపడ్డారు. రెండేళ్లుగా చంద్రబాబు హామీలు నీట మూటలుగా మిగలడంతో అక్కాచెల్లెమ్మలు ఆశలు అడియాశలు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న చంద్రబాబు ఒక ఏడాదికి ఒక సిలిండర్ మాత్రమే అందించారని అది కూడా పూర్తిస్థాయిలో అందించలేకపోయారని పేర్కొన్నారు.ఆడబిడ్డ నిధి ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి మొండి చేయి చూపారని ఆరోపించారు.గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను నిలుపుదల చేయడమే కాకుండా ఇస్తామన్న హామీలను సైతం చంద్రబాబు గాలికి వదిలేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఉచిత బస్సు అనే ఓదరగొట్టి ఆర్టీసీలో 16 క్యాటగిరిలో బస్సులు ఉంటే కేవలం ఐదు కేటగిరీలకు పరిమితం చేశారని కొత్తగా పోనీ బస్సుల్లో ఉచితం లేదని ప్రకటించిన మహానుభావుడు అని ఏద్దెవా చేశారు.కూటమి పాలన లో మహిళలకు రక్షణ కరువు: గత ప్రభుత్వ హయాంలో దిశా చట్టంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తే నేడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని జగన్మోహనరావు  పేర్కొన్నారు.విశాఖ కార్యక్రమాలు రద్దు చేసిన చంద్రబాబు మహిళల్లో చిన్నారుల రక్షణ భద్రతను ప్రమాదంలోకి నెట్టివేశారని వివరించారు.ప్పటికైనా మహిళల్లో చైతన్యం రావాలని ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజాప్రతినిధులను నిలదీయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో వీరులపాడు ఎంపీపీ కోటేరు లక్ష్మి,ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ షహనాజ్ బేగం,అంగన్వాడి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శాఖమూరి వెంకట కుమారి,వైస్ ఎంపీపీ వెలగలేటి మాధవి,మార్తా రజని,ఎంపీటీసీ సభ్యులు వేమా రోజారమణి,ఇందిరా,కర్ల రాధిక,బుడ్డి విజయలక్ష్మి,నాయుడు ఉదయలక్ష్మి,అమర్లపూడి రత్నకుమారి కస్తాల పున్నమ్మ కంచర్ల పద్మ బండారు విజయలక్ష్మి పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular