📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఆచార్య జయశంకర్ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలి

ఆచార్య జయశంకర్ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలి

📰 Generate e-Paper Clip

ఆచార్య జయశంకర్ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించిలి

మేడిపల్లి ఆగస్టు 06 ( మన ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడిగా ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జన హృదయాల్లో నిలిచిపోతారని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు.
గురువారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి,మాజీ మేయర్ సామల బుచ్చి రెడ్డి పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు.అనంతరం జయశంకర్ కాలనీ అసోసియేషన్  ఆధ్వర్యంలో కమిటీ హాల్లో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు,బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి,మాజీ మేయర్ సామల బుచ్చి రెడ్డి పాల్గొని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను అందరికీ అర్ధమయ్యేలా వివరించి ప్రజల్ని చైతన్యపరిచి, స్వరాష్ట్ర సాధన ఉద్యమనిర్మాణం చేసిన పోరాట దిక్సుచి జయశంకర్ సార్ ఆయన ఆశయాలకు అనుగు ణంగా యావత్ తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల అభ్యున్నతికి పాలకులు కృషి చేయాలని అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బోడుప్పల్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్,బందారం శ్రీధర్ గౌడ్,కొత్త చక్రపాణి గౌడ్,నత్తి మైసయ్య,కాటం రాజిరెడ్డి,సురేందర్ రెడ్డి,క్రిష్ణ గౌడ్, శ్రీరాములు,ఉప్పరి విజయ్,దేవరాజ్,కుమార్, చినింగళ్ళ సంతోష్, నాయకులు,కార్యకర్తలు, జయశంకర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular