జయశంకర్ సార్ కు ఘన నివాళులు
రైతుల ప్రజా సమస్యలపై కీలక నిర్ణయాలు
ప్రజావాణి ఆగస్టు 6 కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఈయన చిత్రపటానికి పూలమాల వేసి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ సర్పంచులతో విస్తృతస్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజాసమస్యలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు వ్యవసాయం ఆర్టికల్చర్ మిషన్ భగీరథ విద్య వైద్య నీటి పారుదల విద్యుత్ రెవిన్యూ ఉపాధి హామీ తదితర శాఖల పనితీరు ఎమ్మెల్యే శాఖల వారీగా సమీక్షిస్తూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా ఈ ఆపు విధానాన్ని కాకుండా నేరుగా ఎరువుల షాపుల వద్ద యూరియా అందించాలని సమావేశంలో తీర్మానం చేశారు రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు అలాగే కన్నెపల్లి నుండి నీటిని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానం చేశారు సాగునీటి సమస్య కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు కమలాపూర్ మండల కేంద్రంలో కేసీఆర్ ఇచ్చిన ఇండ్ల పట్టాల ఆధారంగా నిర్మించుకున్న ఇళ్లపై నుంచి వెళ్తున్న 11 కి విద్యుత్ తీగలనో వెంటనే తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశించారు ప్రజల ఇళ్లపై నుంచి ప్రమాదకరంగా వెళ్తున్న విద్యుత్ తీగల కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లో ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన మంచినీటిని నిరంతరం సరఫరా చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను కోరారు ఎక్కడైనా నీటి సరఫరా లో అంతరాయం ఏర్పడితే వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు మండలంలోని పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు తాగునీరు విద్యుత్ రోడ్లు సాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు రైతులు ప్రజలు సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేమాని ఎమ్మెల్యే హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సర్పంచులు ప్రభుత్వ అధికారులు ఎంపీడీవో పాల్గొన్నారు





