📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కేశఖండన మహోత్సవంలో బద్వేల్ మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి కె. విజయమ్మ పాల్గొన్నారు.

కేశఖండన మహోత్సవంలో బద్వేల్ మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి కె. విజయమ్మ పాల్గొన్నారు.

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే04) పోరుమామిళ్ల మండలం,శ్రీ మద్దిమాను గుర్రప్ప స్వామి ఆలయంలో జరిగిన పుట్టువెంట్రుకల (కేశఖండన) మహోత్సవంలో బద్వేల్ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కె. విజయమ్మ,మరియు బద్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీ కె.రితేష్ రెడ్డి పాల్గొన్నారు.పోరుమామిళ్ల మండలం,కృష్ణం పల్లె గ్రామ వాస్తవ్యులు శ్రీ కొండా గురివి రెడ్డి,మనవడు,శ్రీ కొండా మైసూరా రెడ్డి -శ్రీమతి సునంద,ఏకైక కుమారుడు చి.మహీధర్ రెడ్డి కేశఖండన వేడుకకు వారు విచ్చేసి,బాలుడిని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా చిరంజీవి మహీధర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వారు మనసారా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ మద్దిమాను గురప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి,పోరుమామిళ్ల మండల మాజీ అధ్యక్షులు కొండా కృష్ణారెడ్డి,బి.కోడూరు మండల పార్టీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి,గోడి రమణారెడ్డి,అట్లూరు మండల పార్టీ అధ్యక్షులు పాపుదిప్పు మల్లికార్జున రెడ్డి టిఎన్ఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ బోరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మరియు మండల నాయకులు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.