📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetప్రజా ప్రభుత్వంలో రైతు చైతన్యానికి శ్రీకారం గాగిల్లాపూర్‌లో ఘనంగా రైతు వారోత్సవం ప్రారంభం

ప్రజా ప్రభుత్వంలో రైతు చైతన్యానికి శ్రీకారం గాగిల్లాపూర్‌లో ఘనంగా రైతు వారోత్సవం ప్రారంభం

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, మే 4 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించి రైతు వారోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతే రాజు అని, రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మే 4 నుండి మే 9 వరకు రైతు వారోత్సవాన్ని నిర్వహిస్తోందని,రైతుబంధు, రైతుబీమా,24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని తెలుపుతూ,రైతు వారోత్సవం కేవలం ఉత్సవం మాత్రమే కాకుండా రైతు చైతన్య వారం అని పేర్కొంటూ, ప్రతి రోజుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.మే 4న భూసార పరీక్ష దినం, మే 5న విత్తన దినం, మే 6న సేంద్రియ వ్యవసాయ దినం, మే 7న నీటి పొదుపు దినం, మే 8న పంటల బీమా దినం, మే 9న రైతు సన్మాన దినంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. ఏవైనా సందేహాలు ఉంటే ఏఈఓ లేదా గ్రామ పంచాయతీని సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు చింతలపల్లి లత, కొండలరెడ్డి, సొల్లు బాలయ్య, ఏఈఓ తేజస్విని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.