📄 ePaper
Thursday, April 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి ఎస్వీ జూనియర్ కాలేజీలో షాకింగ్ ఘటనలు,, విద్యార్థులపై లెక్చరర్ల దౌర్జన్యం..!

తిరుపతి ఎస్వీ జూనియర్ కాలేజీలో షాకింగ్ ఘటనలు,, విద్యార్థులపై లెక్చరర్ల దౌర్జన్యం..!

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) తిరుపతి ఎస్వీ జూనియర్ కాలేజీలో షాకింగ్ ఘటనలు,విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సమంజసమా విద్యా సంస్థల్లో శిక్షణ పేరుతో మానసిక వేధింపులు ఎందుకు బాధ్యులపై చర్యలు ఎప్పుడో.చదువుతో భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఎస్వీ జూనియర్ కాలేజీలో ఆందోళనకర పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.విద్యార్థుల ఆరోపణల ప్రకారం, కొంతమంది లెక్చరర్లు వారితో అమానుషంగా ప్రవర్తిస్తూ,అసభ్యకర భాషలో దూషిస్తూ మానసికంగా వేధిస్తున్నారని సమాచారం.చిన్నపాటి తప్పులను పెద్దవిగా చూపిస్తూ,విద్యార్థులను అవమానించడం, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం వంటి చర్యలు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు.ఇంకా తీవ్ర ఆరోపణలు ఏమిటంటే-తల్లిదండ్రులను పిలిపించి,విద్యార్థులను అందరి ముందూ నిలబెట్టి అవమానించడం,మీ పిల్లలను వెంటనే తీసుకెళ్లండి… టీసీ ఇస్తాం” అంటూ బెదిరింపులకు దిగుతున్నారని చెబుతున్నారు.ఈ వ్యవహారంలో కాలేజీ ప్రిన్సిపాల్ ప్రకాష్ బాబు,జాగ్రఫీ లెక్చరర్ అనురాధ పాత్రపై విద్యార్థులు,తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర విద్యాసంస్థలకు ఉన్న గౌరవం,విశ్వాసం దృష్ట్యా ఇక్కడ సీటు దక్కడం ఎంతో అదృష్టంగా భావించే తల్లిదండ్రులు,ఇప్పుడు ఈ ఘటనలతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.చదువు కోసం వచ్చిన మా పిల్లలు అవమానాలు ఎదుర్కొంటున్నారు,వెంటనే చర్యలు తీసుకోండి” అని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.ఈ వ్యవహారంపై టీటీడీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఘటనలపై అధికారుల స్పందన ఏంటి,చర్యలు ఎప్పుడు,అనేది ఇప్పుడు కీలకం మారింది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ను కాపాడాల్సిన అవసరం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular