తిరుపతి ఎస్వీ జూనియర్ కాలేజీలో షాకింగ్ ఘటనలు,, విద్యార్థులపై లెక్చరర్ల దౌర్జన్యం..!

ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) తిరుపతి ఎస్వీ జూనియర్ కాలేజీలో షాకింగ్ ఘటనలు,విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సమంజసమా విద్యా సంస్థల్లో శిక్షణ పేరుతో మానసిక వేధింపులు ఎందుకు బాధ్యులపై చర్యలు ఎప్పుడో.చదువుతో భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఎస్వీ జూనియర్ కాలేజీలో ఆందోళనకర పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.విద్యార్థుల ఆరోపణల ప్రకారం, కొంతమంది లెక్చరర్లు వారితో అమానుషంగా ప్రవర్తిస్తూ,అసభ్యకర భాషలో దూషిస్తూ మానసికంగా వేధిస్తున్నారని సమాచారం.చిన్నపాటి తప్పులను పెద్దవిగా చూపిస్తూ,విద్యార్థులను అవమానించడం, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం వంటి చర్యలు జరుగుతున్నాయని...