
మార్కాపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, డీఎస్పీ నాగరాజు సూచనలతో పెద్దారవీడు మండలంలోని ప్రమాదకర మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేశారు. పెద్దారవీడు ఎస్ఐ ఎస్సై సైదుబాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్యతో మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించడంతో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రివేళల్లో ఇది డ్రైవర్లకు ఎంతో సహాయకరం. ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.
