గోళ్ల (ప్రజావాణి న్యూస్ జూన్ 28)గ్రామంలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రతి బిడ్డకు వేసే రెండు పోలియో చుక్కలు వారి నిండు ప్రాణాన్ని కాపాడుతాయి” అని టీడీపీ మండల కన్వీనర్ గోళ్ల వెంకటేశులు పేర్కొన్నారు.కళ్యాణదుర్గం శాసనసభ్యులు,గౌరవనీయులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు సూచనల మేరకు కళ్యాణదుర్గం మండలం ‘గోళ్ల’ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పోలియో కేంద్రంలో చిన్నారులకు చుక్కలు వేయించిన అనంతరం టీడీపీ మండల కన్వీనర్ గోళ్ల వెంకటేశులు మాట్లాడుతూ.చిన్నతనంలోనే పోలియో చుక్కలు వేయిస్తే పిల్లలకు జీవితాంతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులు ఈ విషయాన్ని బాధ్యతగా తీసుకుని తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.వైద్య సిబ్బందికి కీలక సూచనలు గ్రామంలోని ఐదేళ్లలోపు చిన్నారులకు నూటికి నూరు శాతం (100%) పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు. ముఖ్యంగా మొహరం పండుగ సందర్భంగా ఎవరైనా కేంద్రాలకు రాని యెడల,సిబ్బంది స్వయంగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి పోలియో చుక్కలు వేయాలని ప్రత్యేకంగా ఆదేశించారు.ఈ సేవా కార్యక్రమంలో స్థానికులు,నాయకులు తలారి ఎస్వామి,దేవర్ల సురేష్,లింగమయ్య, నాగభూషణ,దాదులూరి సురేష్,తలారి రమణ,ఎద్దుల మల్లికార్జున,కురువ నారాయణ తదితరులు చురుగ్గా పాల్గొన్నారు
ప్రతి బిడ్డకూ రెండు పోలియో చుక్కలు – ప్రాణాలకు శ్రీరామరక్ష!
0
4




