prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 8:58 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రమాదకర మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు..ఎస్సై సైదుబాబు

మార్కాపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) మార్కాపురం జిల్లా  ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, డీఎస్పీ నాగరాజు సూచనలతో పెద్దారవీడు మండలంలోని ప్రమాదకర మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేశారు. పెద్దారవీడు ఎస్ఐ ఎస్సై సైదుబాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్యతో మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించడంతో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రివేళల్లో ఇది డ్రైవర్లకు ఎంతో సహాయకరం. ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.