📄 ePaper
Thursday, April 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మహిళల రక్షణకు తిరుగులేని అస్త్రం శక్తి యాప్ - తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్...

మహిళల రక్షణకు తిరుగులేని అస్త్రం శక్తి యాప్ – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్

📰 Generate e-Paper Clip

అన్నమయ్య జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) రాజంపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయం.అన్ని రంగాలలో దూసుకుపోతున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం”శక్తి యాప్ “ద్వారా తిరుగులేని భద్రత కల్పిస్తుందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు.పేర్కొన్నారు.గురువారం నాడు రాజంపేట పట్టణం, స్థానిక వజ్రం కళ్యాణమండపం నందు పోలీస్ శాఖ ఆహ్వానం మేరకు”శక్తి యాప్”మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట బయట మహిళలకు శక్తి యాప్ ఎంతో భద్రతనిస్తుందని జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు. అదేవిధంగా చమర్తి మాట్లాడుతూ పోలీసుల సలహాలు సూచనలు పాటించి రక్షణ పొందాలన్నారు.గడప దాటితే మహిళకు తిరుగు లేదన్నారు. అంతేకాకుండా మహిళలు స్వేచ్ఛగా బయటకు రావాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ “శక్తి యాప్”ద్వారా మహిళలను చైతన్యవంతం చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ కేవలం సెల్ఫీలకు, అందం చూసుకునేందుకు కాదని,రక్షణకు కూడా పనికొస్తుందని “శక్తి యాప్” ను గుర్తుంచుకోవాలన్నారు. మొబైల్ మీ దగ్గర ఉంటే భద్రత మీ దగ్గర ఉన్నట్లేనని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు 2004లో డ్వాక్రా మహిళల ఆర్థిక శక్తి ఎంతో ప్రపంచానికి చెప్పారన్నారు.పురుషులు వెళితే బ్యాంకు ఏం షూరిటీ పెడతారని అడుగుతున్నారని అదే డ్వాక్రా మహిళలు బ్యాంకుకు వెళితే కేవలం ఆధార్ కార్డు తీసుకువెళ్తే లక్ష నుంచి మూడు రెండు మూడు లక్షల వరకు వరకు కూడా ఎలాంటి షూరిటీ లేకుండా రుణం లభిస్తుందని జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల సత్తా అంటే ఇదేనన్నారు. ఆర్థిక క్రమశిక్షణ వల్ల డ్వాక్రా మహిళలకు బ్యాంకులో రుణాలు అందిస్తున్నాయని తెలియజేశారు.డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించారని, గడప దాటడం వల్లే ఇది సాధ్యమైందని చమర్తి పేర్కొన్నారు.ఇప్పుడు స్వేచ్ఛగా గడప దాటేందుకు శక్తి ఆప్ ఉందని గుర్తు చేశారు చదువుకునే పిల్లలు కూడా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని జగన్ మోహన్ రాజు  సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీ.ఐ నాగార్జున,కడప దిశా ఇన్స్పెక్టర్ యల్లం రాజు,మార్కెట్ కమిటీ చైర్మన్ కి ఎన్ని సుబ్బ నరసయ్య నాయుడు, పట్టణ అధ్యక్షులు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు,రాష్ట్ర కార్యదర్శి ఇడిమడకల కుమార్,పట్టణ ఎస్సై వెంకటేశ్వర్లు,మాజీ కౌన్సిలర్ మనుబోలు వెంకటేశ్వర్లు,ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మందా శ్రీనివాసులు,దిశా పోలీస్ సిబ్బంది, మహిళలు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular